ధోనీని తక్కువ అంచనా వేయొద్దు..ప్రత్యర్థులకు అక్తర్‌ వార్నింగ్‌

చెన్నై కెప్టెన్‌ ధోనిపై పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనిని ఏ జట్టు కూడా తక్కువగా అంచనా వేయకూడదని ప్రత్యర్థి జట్లకు వార్నింగ్‌ ఇచ్చాడు. అతడు ఎంఎస్‌ ధోని.. ఆయన ఏం చేస్తాడన్నది నిజంగా ఊహించలేము. ఏదైనా భిన్నంగా చేయగలడని కొనియాడారు అక్తర్‌.

ఈ విషయంలో అతడు ప్రసిద్దుడు. గొప్ప వ్యక్తి కూడా. వ్యక్తిగతంగా అయితే.. ధోని మరో సీజన్‌ పాటు ఐపీఎల్‌ లో ఆడతాడని నేను అనుకుంటున్నానని చెప్పారు అక్తర్‌. లేదంటే మేనేజ్‌ మెంట్‌ లో భాగం కావచ్చని.. ఓ ప్రముఖ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్‌ వెల్లడించారు. అయితే.. ప్రత్యర్థి జట్లు మాత్రం ధోనిని తక్కువగా అంచనా వేయద్దన్నారు.

కాగా..నిన్నటి పరుగులతో ఈ లీగ్‌ డెత్‌ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌ గా రికార్డు నెలకొల్పాడు ధోని. 15 ఏళ్ల ఈ మెగా లీగ్‌ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పినప్పటికీ.. తనలో ఫినిషనర్‌ ఇంకా బతికే ఉన్నాడని అవకాశం దొరికినప్పుడల్లా రుజురు చేస్తూనే ఉన్నాడు ధోని.