ఐపీఎల్ 2022 కోసం ఫ్రొంఛైజీలు సిద్దం అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో మెగా వేలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ఫ్రొంఛైజీల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ ఐపీఎల్ ను కొత్తగా ప్రారంభించాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఆటగాళ్లును కూడా దూరం పెట్టింది. కోచ్ లను మార్చింది. తాజా గా జెర్సీని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మార్చింది. కొత్త జెర్సీని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
ఇంతకు ముందు జెర్సీ పూర్తిగా ఆరెంజ్ రంగుతో ఉండి మధ్య భాగంలో డేగా ఉండేది. కానీ ఇప్పుడు డేగాను తీసివేశారు. జెర్సీ మొత్తం ఆరెంజ్ రంగుతోనే ఉంచారు. అలాగే ప్యాయింట్ కూడా ఆరెంజ్ రంగులోకి మార్చేశారు. ఆరెంజ్ ఆర్మీ అనే పేరుకు తగినట్టుగా జెర్సీని రూపొందించారు. కాగ గత ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ దారుణమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
పలు మార్పులు చేసి ఈ సారి ఐపీఎల్ లో మేటీ ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తుంది. మెగా వేలంలో కూడా సన్ రైజర్స్ ఆచి తూచి వ్యవహరించే అవకాశం ఉంది. నాణ్యమైన ఆటగాళ్లును తీసుకోవాడనికే రిటేన్షన్ ప్రక్రియాలో డబ్బులు వృథా చేయలేదని తెలుస్తుంది.
Presenting our new jersey.
The #OrangeArmour for the #OrangeArmy 🧡#ReadyToRise #IPL pic.twitter.com/maWbAWA0pc
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022