ఓటమి తర్వాత తన ఆటగాళ్లకు పాంటింగ్ చెప్పింది ఇదే…!

మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ తో జరిగిన ఐపిఎల్ 2020 ఫైనల్‌ లో ఓటమి తర్వాత తన ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసాడు ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్. తన ఆటగాళ్లకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. పాంటింగ్ తన టీంతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కి సిద్దం కావాలని అతను తన టీంకి సూచించాడు.

ఈ ఏడాదిని మర్చిపోదాం అని అతను తన ఆటగాళ్లకు సూచించాడు. కాని ఇది మనకు మరో ముందు అడుగు అన్నాడు. కాని ఇది అద్భుతమైన టీం అన్నాడు. వచ్చే ఏడాది టీం మళ్ళీ కచ్చితంగా బౌన్స్ అవుతుంది అని అతను ధీమా వ్యక్తం చేసాడు. అయిదవ సారి నిన్న ముంబై టైటిల్ గెలుచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టు ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలం అయింది.