స్పోర్ట్స్ ప్ర‌జెంట‌ర్ సంజ‌న గ‌ణేశ‌న్‌ను పెళ్లి చేసుకోనున్న జ‌స్‌ప్రిత్ బుమ్రా..?

-

భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా ఒక ఇంటి వాడు కానున్నాడా ? అంటే అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బుమ్రా, న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌లు వివాహం చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాటిని వారు కొట్టి పారేశారు. అయితే బుమ్రాకు, క్రీడా వ్యాఖ్యాత సంజ‌న గ‌ణేశ‌న్‌కు వివాహం జ‌రుగుతుంద‌ని ప్ర‌స్తుతం వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ నేడో, రేపో వివాహం చేసుకుంటార‌ని కూడా తెలుస్తోంది.

jasprit bumrah to marry sanjana ganeshan reports

జ‌స్‌ప్రిత్ బుమ్రా ఇప్ప‌టికే ఇంగ్లండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌కు బీసీసీఐ నుంచి లీవ్ తీసుకున్నాడు. దీంతో అత‌ను వివాహం కోస‌మే లీవ్ తీసుకున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యాన్ని బుమ్రా గానీ, అత‌ని కుటుంబ స‌భ్యులు గానీ నిర్దారించ‌లేదు. మ‌రోవైపు బుమ్రాకు, సంజ‌న‌కు గోవాలో పెళ్లి జ‌రుగుతుంద‌ని, కేవ‌లం కొద్ది మంది స్నేహితులు, కుటుంబ స‌భ్యుల న‌డుమ వారి వివాహం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ‌యో సెక్యూర్ బ‌బుల్‌లో ఉన్నారు. క‌నుక వారు బుమ్రా వివాహానికి హాజ‌రు కాలేరు.

కాగా బుమ్రా వివాహం అయ్యాక మార్చి 23వ తేదీన ఇంగ్లండ్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడ‌ని స‌మాచారం. గతేడాది ఐపీఎల్ సీజ‌న్‌లో టాప్ వికెట్ టేక‌ర్స్‌ల‌లో బుమ్రా ఒక‌డు. ఇక సంజ‌న మాజీ మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ కాగా ఆమె ఐపీఎల్ సంద‌ర్భంగా వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఐపీఎల్ సీజ‌న్ స‌మ‌యంలో ఆమె కోల్‌క‌తా టీమ్‌తో కేకేఆర్ డైరీస్ అనే షోను కూడా నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రూ వివాహం చేసుకోనున్నార‌ని వార్త‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మ‌రి వాటిని వారు నిజం చేస్తారా, లేదా అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news