కోహ్లీ కంటే రహానేనే బెటర్ అన్న వ్యాఖ్యలపై కపిల్ దేవ్ స్పందన..

-

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకుని అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భారత క్రికెట్ జట్టు గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ కి సారథ్యం వహించిన రహానేని టెస్టులకి కెప్టెన్ ని చేయాలని చాలా మంది అంటున్నారు. టెస్టులకి రహానేని, ట్వంటీ ట్వంటీలకి రోహిత్ శర్మని, వన్డేలకి కోహ్లీని కెప్టెన్ గా నియమించాలని, ఇలా మూడు ఫార్మాట్లకి ముగ్గురు కెప్టెన్లుగా ఉంటే బాగుంటుందన్బి సూచిస్తున్నారు.

ఈ విషయమై భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. మూడు ఫార్మాట్లకి ముగ్గురు వేరు వేరు కెప్టెన్లు ఉండడం సరైన పని కాదని, కోహ్లీ అందుబాటులో లేనపుడు రహానే, రోహిత్ శర్మలు కెప్టెన్ గా కొనసాగడం బాగానే ఉందని, ఇలానే కంటిన్యూ చేయడం బాగుంటుందని అన్నాడు. మొత్తానికి ముగ్గురు కెప్టెన్లు ఉండాలన్న పుకార్లపై ఇకనైనా వార్తలు రావడం ఆగుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కి సిద్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news