దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతాను: విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనున్నట్లు బుధవారం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. కానీ, వన్డే జట్టుకు సారథ్యం వహించనని సెలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీ) అతని స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించింది.

నేను సెలెక్షన్ కోసం అందుబాటులో ఉన్నాను. నేను సెలెక్షన్ కోసం అందుబాటులో ఉన్నాను. పదేపదే ఈ విషయమై మీరు నన్ను ప్రశ్నలు అడగకూడదు. నేను సెలెక్షన్‌కు అందుబాటులో లేను అని రాసిన వారిని, వారికి సమాచారం ఇచ్చిన వారిని అడగండి. నా విషయానికి వస్తే, నేను సెలెక్షన్ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని రిపోర్టర్లకు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.