శ్రీ‌లంక జ‌ట్టును, ఫ్యాన్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న భార‌త క్రికెట్ ఫ్యాన్స్‌.. ‘సి’ టీమ్ పై గెలిచార‌ని కామెంట్లు..

కొలంబ‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త్‌పై శ్రీ‌లంక జ‌ట్టు అతి క‌ష్టం మీద గెలిచిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ నిర్దేశించిన 133 ప‌రుగుల లక్ష్యాన్ని శ్రీ‌లంక అతి క‌ష్టం మీద ఛేజ్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ధ‌నంజ‌య డిసిల్వ‌, క‌రుణ‌ర‌త్నెలు ఎంతో క‌ష్ట‌ప‌డి జ‌ట్టును గెలిపించారు.

అయితే శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌పై గెలిచాక ఆ దేశ ప్యాన్స్ ఒక రేంజ్‌లో సంబ‌రాలు చేసుకున్నారు. అదేదో వ‌ర‌ల్ఢ్ క‌ప్ గెలిచినంత సంబ‌ర‌ప‌డ్డారు. కానీ భార‌త ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. శ్రీ‌లంక గెలిచింది భార‌త ‘సి’టీమ్‌పై అని కామెంట్లు చేస్తున్నారు. దానికే ఇంత‌లా రెచ్చిపోవాలా అంటున్నారు.

అస‌లు మ్యాచ్‌లో అనేక సార్లు అంపైర్లు పొర‌పాట్లు చేశారు, లేదంటే భార‌త్ గెలిచి ఉండేద‌ని అభిమానులు భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నిజానికి కోవిడ్ భ‌యంతో టాప్ ప్లేయ‌ర్లు ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యారు. దీంతో ఏకంగా 4 మంది కొత్త ప్లేయ‌ర్లు రెండో టీ20 ఆడారు. దాన్ని ఇండియా ‘సి’ టీమ్‌గానే చెప్పాలి. అలాంటి టీమ్ మీద‌, అదీ అంపైర్ల త‌ప్పిదాల కార‌ణంగా శ్రీ‌లంక గెలిచింది. అందుక‌నే భార‌త ఫ్యాన్స్ వారిని ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సిరీస్‌లో 1-1తో ఇరు జ‌ట్లు స‌మాన స్థితిలో ఉండ‌గా, నిర్ణ‌యాత్మ‌క మూడో టీ20 గురువారం రాత్రి జ‌ర‌గ‌నుంది.