పెళ్లి పీట‌లెక్క‌బోతున్న టీమిండియా ఆల్ రౌండర్..!

-

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించాడు. వైశాలి విశ్వేశ్వరన్ అనే యువతితో నిశ్చితార్థం జరుగగా, ఆ చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైశాలితో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ఉంగరం ఎమోజి జతచేశాడు. ఈ పోస్టుకు సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే..  ఇటీవలనే మరో క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్‌ సైతం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

View this post on Instagram

💍 PC – @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on

కాగా, తమిళనాడుకు చెందిన శంకర్ 2018లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ నుంచి భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్‌బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి వన్డేలో అరంగేట్రం చేశాడు. త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్ ‌2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news