ఈ రోజు మ్యాచ్ లో ముంబై టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగింది, మొదటి పవర్ ప్లే లో రోహిత్ శర్మ వికెట్ ను కోల్పివడం మినహా మరే ఇబ్బంది లేదు. పవర్ ప్లే సమయానికి ముంబై ఇండియన్స్ ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై స్పిన్నర్లు రంగంలోకి దిగారు, వరుసగా కేవలం 12 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్ 32 పరుగులతో మంచి టచ్ లోకి వచ్చాడు అనుకుంటుండగానే వికెట్ ఇచ్చేశాడు, ఆ తర్వాత గ్రీన్ 12, సూర్యకుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ 22, అర్షద్ ఖాన్ 2 లు వికెట్లను ఈజీ గా చెన్నై స్పిన్నర్ లకు ఇచ్చేశారు.
ముఖ్యంగా జడేజా 3 వికెట్లు తీసి ముంబై ని దారుణంగా దెబ్బ తీశాడు. ఒక దశలో ముంబై 200 పరుగులు చేస్తుందనుకుంటే పేకమేడలా ఒకరి వెంట మరొకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. మరి ప్రస్తుతం ఉన్న దశలో కనీసం 150 పరుగులు చేసినా గొప్పే అనుకోవాలి.