ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా ఒక సంఘటన గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అయ్యి తీరుతారు. సిసిలీ కి చెందిన గియోవన్నీ విగ్లీ యాటో అన్యే వ్యక్తికి సంబంధించిన వార్త కావడం విశేషం. ఇతను 1929వ సంవత్సరంలో జన్మించాడు. సరిగ్గా ఇతనికి 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి అంటే 1949 నుండి 1981 సంవత్సరం మధ్యలో ఇతను 105 మంది మహిళలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు.
అసలు ఇలా వీలవుతుందా అంటే… ఇతని విషయంలో వీలయింది. అందరూ ఇతని చేతిలో ఇతను చెప్పిన మాటలకు మోసపోయి పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా మొత్తం 14 దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణంతో అతనిపై కేసులు నమోదు కావడంతో పోలీసులు 1981 లో అరెస్ట్ చేసి 34 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.