ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్లే..? విండీస్ టూర్‌కు మాత్రం దూరంగానే..?

-

ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్ నేపథ్యంలో భారత జట్టును సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు. కానీ అందులో ధోనీ ఉంటాడా, ఉండడా.. అని వార్తలు వచ్చాయి.

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత క్రికెటర్ ధోనీ చేసిన యావరేజ్ ప్రదర్శనకు ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్న విషయం విదితమే. ధోనీ వరల్డ్ కప్ టోర్నీలో ఇంకా బాగా ఆడి ఉంటే.. టీమిండియా మరోమారు కప్పు గెలిచేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ధోనీని పలువురు ఫ్యాన్స్, మాజీలు రిటైర్ అవ్వాలని సూచించారు. ఇక ఇదే వరల్డ్‌కప్ ధోనీకి ఆఖరుది అవుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ధోనీ అప్పుడే తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. తాను ఇప్పుడప్పుడే రిటైర్ కావడం లేదని, అందుకు ఇంకా సమయం పడుతుందని అన్నాడు.

Dhoni might not take retirement but will keep away from west indies tour

అయితే ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్ నేపథ్యంలో భారత జట్టును సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు. కానీ అందులో ధోనీ ఉంటాడా, ఉండడా.. అని వార్తలు వచ్చాయి. ఇక కొందరు మళ్లీ ధోనీ రిటైర్మెంట్‌ను తెరపైకి తెచ్చారు. విండీస్ టూర్‌లోనే ధోనీ రిటైర్ అవుతాడని అన్నారు. మరికొందరు ధోనీని తప్పుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతానికి ధోనీ ఈ టూర్‌కు వెళ్లడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే సెలక్టర్లు ధోనీకి విండీస్ టూర్ నుంచి విశ్రాంతినిస్తారని ప్రచారం సాగుతోంది.

ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని, అలాగే విండీస్ టూర్‌కు కూడా దూరంగా ఉంటాడని సమాచారం. ఈ మేరకు ధోనీ స్వయంగా తనకు విశ్రాంతి కావాలని బీసీసీఐకి చెందిన ఓ అధికారికి చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా రేపు ముంబైలో జరగనున్న సెలెక్షన్ కమిటీ సమావేశంలో విండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ధోనీకి బదులుగా ఈ టూర్‌కు రిషబ్ పంత్‌ను సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా ధోనీ వచ్చే రెండు నెలలు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారా మిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేస్తాడని కూడా సమాచారం అందుతోంది. మరి ధోనీ విండీస్ టూర్‌కు వెళ్తాడో లేక రెస్ట్ తీసుకుంటాడో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news