పసికూన ఆఫ్గనిస్థాన్‌పై ఇంగ్లండ్ సిక్సర్ల వర్షం.. 50 ఓవర్లకు స్కోరు.. 397/6..

-

మాంచెస్టర్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌పై ఇంగ్లండ్ విజృంభించి ఆడింది. ఇంగ్లిష్ జట్టు బ్యాట్స్‌మెన్ సిక్సర్ల వర్షం కురిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మోర్గాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 71 బంతుల్లోనే 4 ఫోర్లు, 17 సిక్సర్లతో మోర్గాన్ 148 పరుగులు చేశాడు. వన్డేల్లో క్రిస్ గేల్ కొట్టిన 16 సిక్సర్ల రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. అలాగే జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 90 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (82 బంతుల్లో 88 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు కూడా రాణించారు. ఇక చివర్లో మొయిన్ అలీ (9 బంతుల్లో 31 పరుగులు, 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. కాగా ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో దవ్లాత్ జద్రాన్, గుల్బదీన్ నయీబ్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news