చిన్నారిని కాపాడిన కుక్క.. వైరల్ వీడియో

ఓ కుక్క చిన్నారిని కాపాడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీటి కొలను దగ్గర ఉన్ని చిన్నారి.. నీటిలో తన వస్తువు పడితే తీసుకోవడానికి నీటి వైపు వెళ్లింది. అలాగే లోపలికి వెళ్లబోతున్న చిన్నారిని గమనించిన కుక్క వెంటేనే చిన్నారి గౌను పట్టుకొని వెనక్కి లాగింది. తర్వాత నీళ్లలో పడిపోయిన చిన్నారి ఆడుకునే వస్తువును కూడా తీసుకొచ్చి ఒడ్డున పడేసింది. అయితే… ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదు. నెటిజన్లు అయితే ఆ కుక్కపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.