సెంచరీతో అదరగొట్టిన రూట్.. వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

-

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్ 94 బంతుల్లో 100 పరుగులు చేయగా.. బెయిర్ స్టో 46 బంతుల్లో 45 పరుగులు, వోక్స్ 54 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. సౌతాంప్టన్‌లో వెస్టిండిస్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 44.4 ఓవర్లకు 212 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు 213 పరుగుల చిన్న లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అయితే.. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లాండ్‌కు చాలా సులువయింది. రూట్ సెంచరీ కొట్టి స్కోర్‌ను పెంచడంతో కేవలం 33.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ముగించేసింది. కేవలం రెండు వికెట్ల నష్టంతో ఇంగ్లాండ్ 213 పరుగులు చేసి వెస్టిండిస్‌పై ఘన విజయం సాధించింది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్ 94 బంతుల్లో 100 పరుగులు చేయగా.. బెయిర్ స్టో 46 బంతుల్లో 45 పరుగులు, వోక్స్ 54 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

వెస్టిండిస్ ఆటగాళ్లలో పూరన్ 78 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హెట్‌మైర్ 48 బంతుల్లో 39, క్రిస్ గేల్ 41 బంతుల్లో 36 పరుగులు, రస్సెల్ 16 బంతుల్లో 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వూడ్, అర్చెర్‌కు చెరో మూడు వికెట్లు దక్కగా.. రూట్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రూట్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపిక చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news