మా నాన్న ఆరోజు నన్ను తిట్టారు.. చిరంజీవి గురించి రామ్ చరణ్..!

280

తన తండ్రి చిరంజీవి గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు రామ్ చరణ్. తన తండ్రి గొప్ప మనిషి అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు మహిళలు అంటే చాలా గౌరవమని అన్నారు. ఇక.. తన తల్లి అంటే కూడా ఆయనకు చాలా ఇష్టమని.. ప్రేమ అని చెప్పారు.

ప్రపంచ తండ్రుల దినోత్సవం 2019లో జూన్ 16న వస్తోంది. అంటే ఆదివారం అన్నమాట. ఈసందర్భంగా ప్రతి కొడుకు తన తండ్రిని గుర్తు చేసుకోవాలి. పిల్లలను పెంచి పెద్ద చేసి.. వాళ్లకు ఓ దారి చూపేవాడు తండ్రి. అందుకే తండ్రి స్థానం గొప్పది.

ఈసందర్భంగా తన తండ్రి చిరంజీవి గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు రామ్ చరణ్. తన తండ్రి గొప్ప మనిషి అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు మహిళలు అంటే చాలా గౌరవమని అన్నారు. ఇక.. తన తల్లి అంటే కూడా ఆయనకు చాలా ఇష్టమని.. ప్రేమ అని చెప్పారు.

నా తండ్రితో పాటు.. నా తల్లితో కూడా అనుబంధం ఎక్కువే. నా తల్లితో అన్ని విషయాలు పంచుకునేవాడిని. అప్పుడప్పుడు మేం పోట్లాడుకుంటాం కూడా. అయితే.. మా అమ్మకు ఎదురు చెబితే మాత్రం నాన్నకు నచ్చదు. ఓసారి.. అమ్మ వెళ్దాం పదరా.. అనగా.. వెళ్దాంలే కాసేపు కూర్చో అమ్మ.. అన్నా అంతే. మా నాన్నకు కోపం వచ్చింది. ఫుల్లుగా క్లాస్ పీకాడు. అమ్మ ఎదురు చెబుతావా? అంటూ తిట్టారు. ఆయన నన్ను తిట్టడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్. నాన్నకు సాధారణంగా కోపం రాదు. పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు.. అంటూ తన తండ్రి తిట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్.