కెమెరా ముందు కాదు.. వెనుకే చాలా చేస్తాం.. ఎంత డేర్‌గా చెప్పింది రకుల్?

970

సినిమాల్లో ఎంత కష్టపడినా కేవలం సినిమా హిట్, ఫ్లాప్ మీద ఆధారపడి హీరోయిన్‌ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటోంది ఈ సుందరి. కానీ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతోందంటూ బాధపడుతోంది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్.. చాలా డేరింగ్ పర్సనాలిటీ. ఇంటర్వ్యూలోనూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. ఏమాత్రం బెదరదు. ఆమధ్య సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్ట్ పెట్టిన ఓ వ్యక్తిని చెడామడా తిట్టింది గుర్తుంది కదా. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను తెలిపింది.

సినిమాల్లో ఎంత కష్టపడినా కేవలం సినిమా హిట్, ఫ్లాప్ మీద ఆధారపడి హీరోయిన్‌ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటోంది ఈ సుందరి. కానీ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతోందంటూ బాధపడుతోంది రకుల్. ఇది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ జయాపజయాలు కామన్.. వాటి ప్రకారం హీరోయిన్ టాలెంట్‌ను అంచనా వేయడం ఎంతవరకు కరెక్ట్.. అంటోంది.

హీరోయిన్ అంటే కెమెరా ముందు కనబడే వ్యక్తి మాత్రమే కాదు. కెమెరా ముందు అంత అందంగా కనిపించాలంటే కెమెరా వెనుక హీరోయిన్ ఎంతో చేయాల్సి ఉంటుంది. ఎన్నింటినో త్యాగం చేయాల్సి ఉంటుంది. కెమెరా వెనుకనే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. డైట్ విషయంలో కానీ.. వ్యాయామం విషయంలో కానీ.. చాలా కఠినంగా ఉండాలి. ఇది అందరు హీరోయిన్లకు వర్తిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

రకుల్ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్‌లో ప్రస్తుతం నాగ్ సరసన మన్మథుడు 2 లో రకుల్ నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ ఇటీవల వచ్చిన దేదే ప్యార్ దే సినిమాలో రకుల్ నటించినప్పటికీ.. ఆ సినిమా డిజాస్టర్ అయింది. తమిళంలో వచ్చిన ఎన్‌జీకే సినిమా కూడా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది.