HCA లో అక్రమాలు జరిగాయంటూ.. బిసిసిఐకి నకిలీ మెయిల్

-

బిసిసిఐకి ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా బీసీసీఐకి నకిలీ ఈ మెయిల్ పంపారు కొందరు కేటు గాళ్లు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ( HCA ) లో అక్రమాలు పేరు తో మెయిల్‌ ను పంపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు జరిగాయని బిసిసిఐ కి నకిలీ ఈ-మెయిల్ పంపడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

బిసిసిఐ ఆడిట్ అధికారి పేరుతో మెయిల్ చేసిన కేటుగాళ్ళు… హెచ్‌సీఏ లో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. దీంతో ఈ మెయిల్ పై ఆడిట్ అధికారిని వివరణ అడిగింది బీసీసీఐ పాలక మండలి. అది ఫెక్ ఈ-మెయిల్ అని తేలడంతో.. సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు బీసీసీఐ ఆడిట్ అధికారి. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు…కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బీసీసీఐకి ఫేక్‌ మెయిల్‌ పంపిన వారి…. పని పడతామని.. సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వారు ఎక్కడ దాక్కున్నా.. రెండు రోజుల్లో పట్టుకుంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news