వీరిని ఓడించడం సవాలే..!

-

జులై 13 నుంచి భారత జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ల కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువజట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. అయితే ఇదే సమయంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కోసం సీనియర్లతో కూడిన భారత జట్టు అక్కడ సన్నద్ధం అవుతోంది.

ఓడించడం /Defeating
ఓడించడం /Defeating

కాగా శ్రీలంక పర్యటనకు బీసీసీఐ యువకులతో కూడిన జట్టును పంపడం పట్ల శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ ఇటీవలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. భారత ద్వితీయశ్రేణి జట్టుతో ఆడేందుకు అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.అయితే అర్జున రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక మాజీ క్రికెటర్‌ అరవింద డిసిల్వా తాజాగా స్పందించారు. భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని గుర్తు చేస్తూ… ఆ జట్టు ఎవరినైనా ఓడించగలదని అన్నారు.

శ్రీలంక పర్యటనకు వచ్చిన భారత బృందాన్ని ద్వితీయ శ్రేణిదిగా భావించొద్దని డిసిల్వా సూచించారు.అన్ని జట్లలాగే ఈ జట్టు కూడా మెరుగైందేనని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ జట్టును ఓడించడం సవాలేనని పేర్కొన్నారు. వీరిపై గెలిస్తే ఆ ఆత్మవిశ్వాసంతో టీ20 ప్రపంచకప్‌నకు వెళ్లొచ్చని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఒకే దేశం రెండు జట్లను ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ళకు మానసిక ఒత్తిడి తగ్గించేలా కుటుంబాలతో గడిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news