టీం ఇండియా యువ ఓపెనర్ ప్రయోగాలు ఆపితే బెస్ట్…!

టీం ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు టీం ఇండియా మాజీ ఆటగాడు, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాక్ ఇచ్చాడు. అనవసరంగా ప్రయోగాలు చేయవద్దు అని సూచనలు చేసాడు. సాధ్యం కాని షాట్ లు ఆడకుండా ఉండటం మంచిది అనే సలహా ఇచ్చాడు. ఆ షాట్ లు ఆడటం కంటే వదులుకోవడం మంచిది అని సూచించాడు. ఈ ఏడాది ఐపిఎల్ ప్రారంభంలో పృథ్వీ షా పర్వాలేదనిపించాడు.

కాని జట్టుకి కీలకమైన సమయంలో మాత్రం అతని ఆట తీరు ఆశించిన స్థాయిలో లేదు. 11 మ్యాచుల్లో కేవలం 219 పరుగులు చేశాడు. అతను రెండు మ్యాచులకు దూరంగా కూడా ఉన్నాడు. సెహ్వాగ్ ని రోల్ మోడల్ గా తీసుకోవాలి గాని ప్రతీ షాట్ అలా ఎలా ఆడతారు అంటూ ప్రశ్నించాడు. కాగా ఢిల్లీకి ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే ఒక విజయం అవసరం.