ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్ మాల్.. ఈడీ దర్యాప్తు ముమ్మరం

-

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవలే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.  హెచ్‌సీఏలో దాదాపు  రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవలే ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో  హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

అయితే తాజాగా ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్ మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా  మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది ఈడీ.  HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ను ఈనెల 8న విచారించిన ఈడి.. అజారుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీ డ్రెచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ మూడు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. వీరికి  ఈనెల 22న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ.  జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువులు కొనుగోలుకు సంబంధించి కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news