టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్‌

-

ఐపీఎల్ సీజన్ 2022లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఈ రోజు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఆరెంజ్ ఆర్మీతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే ఈ సీజన్ లో గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది.

GT vs SRH Prediction IPL 2022 (जीटी बनाम एसआरएच भविष्यवाणी आईपीएल 2022): जीटी बनाम एसआरएच ड्रीम 11 भविष्यवाणी, फैंटेसी क्रिकेट टिप्स, प्लेइंग इलेवन, पिच ...

గుజరాత్‌కు ఒకే ఒక ఓటమి చవిచూసింది. అది కూడా సన్‌రైజర్స్ చేతిలోనే.. దీంతో ఆరెంజ్ ఆర్మీ పై తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ కసిగా ఉంది. హార్దిక్ పాండ్యా తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని చెప్పాడు. సన్‌రైజర్స్ జట్టులో సుచిత్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడని విలియమ్సన్ తెలిపాడు.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్, అల్జరీ జోసెఫ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), శశాంక్ సింగ్, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్ కుమార్, మార్కో జన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

 

Read more RELATED
Recommended to you

Latest news