రేవంత్ రెడ్డితో RGV..టీపీసీసీ చీఫ్‌ను టైగర్‌తో పోల్చిన డైరెక్టర్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదేని విషయమై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటుంటారు. అలా వివాదాలను కోరి మరీ తెచ్చుకుని మీడియా లో హెడ్ లైన్స్ గా ఉంటారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ…టీపీసీసీ చీఫ్, మల్కా్జ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘‘విత్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ’’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఈ విషయం నెట్టింట చర్చనీయాంశమవుతున్నది.

తెలంగాణలో నిజమైన పులి రేవంత్ రెడ్డి అని పేర్కొన్న వర్మ..ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచారు. అంతలోనే కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ను కలవడం చర్చనీయాంశమవుతున్నది. వర్మ..తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళీధర్ పై బయోపిక్ ‘కొండా’ తీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే బహుశా రేవంత్ రెడ్డిపైన సినిమా తీయడానికి వర్మ..రేవంత్ ను కలిశారా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫొటోలో వర్మ అప్యాయంగా రేవంత్ రెడ్డి భుజంపై వేయడం చూసి నెటిజన్లు ఓహో అంటున్నారు. ఈ క్రమంలోనే రకరకాల మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Ram Gopal Varma
Ram Gopal Varma

‘‘వడ్లు దంచితే బియ్యం..టైగర్ రేవంతన్న సీఎం’’, ‘రియల్ టైగరా?… కామెడీ’, ‘ఏదో సినిమా మూడ్ లో ఉన్నట్లున్నారు’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరి కొందరు నెటిజన్లు అయితే రామ్ గోపాల్ వర్మ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారనే పోస్టులు పెడుతున్నారు. అయితే, బహుశా క్యాజువల్ గానే వర్మ.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి ఉంటారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news