ధోనీ.. ఆ గుర్తును గ్లౌజ్‌పై నుంచి తీసేయ్‌.. ఐసీసీ ఆదేశం..!

-

ఐసీసీ నియ‌మాళి ప్ర‌కారం… క్రికెట‌ర్లు తాము ధ‌రించే దుస్తులు, లేదా ఇత‌ర‌త్రా సామ‌గ్రిపై ఎలాంటి రాజ‌కీయ‌, మ‌త‌, వ‌ర్గానికి చెందిన గుర్తులు, అక్ష‌రాలు ప్రింట్ వేయించుకోరాదు. వాటిని ధ‌రించరాదు.

టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ ధోనీకి ఆర్మీ అంటే ఎంత గౌర‌వ‌మో అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే ధోనీ ఖాళీగా ఉన్న‌ప్పుడ‌ల్లా సైనికుల‌ను క‌ల‌వ‌డం చేస్తుంటాడు. ఇక ధోనీకి ఆర్మీలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదా కూడా ఉంది. అందుకనే ధోనీ ఖాళీ స‌మ‌యాల్లో సైనికుల‌తో గ‌డిపేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటాడు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ధోనీ త‌న గ్లౌజుల‌పై బ‌లిదాన్ గుర్తు వేసుకున్నాడు క‌దా.. కాగా ఆ గుర్తు ఐసీసీ నియ‌మాళికి విరుద్ధ‌మ‌ని ఆ సంస్థ చెప్పింది. దీంతో ఆ గుర్తును ధోనీ వెంట‌నే త‌న గ్లౌజుల‌పై నుంచి తీసేయాల‌ని కూడా ఐసీసీ ఆదేశించింది.

ధోనీ గ్లౌజుల‌పై ఉన్న బ‌లిదాన్ (ఆర్మీకి చెందిన ఓ లోగో) గుర్తును తొలగించాల‌ని ఐసీసీ బీసీసీఐకి సూచించింది. తాజాగా సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ధోనీ త‌న గ్లౌజుల‌పై బ‌లిదాన్ గుర్తు వేసుకోగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయ‌ర్ పెహ్‌లుక్‌వాయోను ధోనీ స్టంపౌట్ చేశాడు. దీంతో ధోనీ గ్లౌజ్‌పై ఉన్న బ‌లిదాన్ గుర్తు కెమెరాకు చిక్కింది. ఈ క్ర‌మంలో ఆ ఫొటో కాస్తా నెట్‌లో వైర‌ల్ అయ్యే సరికి అంద‌రూ ధోనీకి ఆర్మీపై ఉండే అభిమానాన్ని మెచ్చుకున్నారు.

అయితే ఐసీసీ నియ‌మాళి ప్ర‌కారం… క్రికెట‌ర్లు తాము ధ‌రించే దుస్తులు, లేదా ఇత‌ర‌త్రా సామ‌గ్రిపై ఎలాంటి రాజ‌కీయ‌, మ‌త‌, వ‌ర్గానికి చెందిన గుర్తులు, అక్ష‌రాలు ప్రింట్ వేయించుకోరాదు. వాటిని ధ‌రించరాదు. దీంతో ధోనీని బ‌లిదాన్ గుర్తును తీసేయాల‌ని కోరామ‌ని ఐసీసీ ప్ర‌తినిధి ఒక‌రు మీడియాతో తెలిపారు. కాగా ధోనీ చేసిన చ‌ర్య‌ ఐసీసీ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంది కానీ.. మొద‌టి త‌ప్పిదంగా భావించి ధోనీకి ఎలాంటి జ‌రిమానా, శిక్ష విధించ‌డం లేద‌ని కూడా స‌ద‌రు ఐసీసీ ప్ర‌తినిధి తెలిపారు..!

Read more RELATED
Recommended to you

Latest news