టీమిండియా టార్గెట్ 204 రన్స్… ఆదిలో అవుట్ అయిన రోహిత్ శర్మ

-

న్యూజిలాండ్ తో తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ కొలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు. షమీకి ఒక్క వికెట్ కూడా పడలేదు. ఈరోజు జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టుకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో అలవోకగా సిక్స్ బాదిన రోహిత్ శర్మ (7: 6 బంతుల్లో 1×6) తర్వాత బంతికే ఔటైపోయాడు. శాంట్నర్ ఊరిస్తూ విసిరిన బంతిని రోహిత్ స్టాండ్స్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచిపోయింది. దీంతో.. ఫీల్డర్ రాస్‌టేలర్ అలవోకగా దాన్ని అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news