నిన్న రాత్రి చెన్నై లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయకేతనాన్ని ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కు మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఛేజింగ్ లో చెన్నై ను కట్టడి చేయడానికి సంజు శాంసన్ ఎక్కువ సమయం తీసుకోవడంతో ఓవర్ లు ఆలస్యంగా పూర్తి చేయడం జరిగింది.
ఐపీఎల్ 2023 :సంజు శాంసన్ కు మ్యాచ్ రిఫరీ జరిమానా!
-