మరో మూడు నెలల్లో జరిగే ఐపియల్ కోసం ఫ్రాంచైజీలు వేలం పాటలో పాల్గొన్నాయి. 332 మంది ఆటగాళ్ళు పాల్గొన్న ఈ వేలంలో… విదేశీ ఆటగాళ్ళు సత్తా చాటారు. ఆసిస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 15.5 కోట్లకు కోలకతాకు అమ్ముడుపోయాడు.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్… 10 కోట్లకు బెంగుళూరు దక్కించుకుంది… ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ని 5.25 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. రాబిన్ ఊతప్పను మూడు కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
జాసన్ రాయన్ ని 1.5 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఆరోన్ ఫించ్ ని 4 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ని ఢిల్లీ 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. మ్యాక్స్వేల్ ని 10 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ యువ ఆటగాడు శామ్ కరణ్ ని… 5.5 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. క్రిస్ లిన్ ని ముంబై కనీస ధర 2 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. ఫాంలో లేక టీం ఇండియా కు దూరమైన… యూసఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీని ఎవరూ కొనుగోలు చేయలేదు.
అదే విధంగా టెస్ట్ ఆటగాళ్ళుగా గుర్తింపు పొందిన హనుమ విహారి, చతేస్వర్ పుజారాని కనీస ధరకు కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. పుజారా గత రెండేళ్ళుగా ఐపియల్ వేలంలో ఉన్నా సరే ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకు ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లే సత్తా చాటారు… ఇదిలా ఉంటే టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు గా ఉన్న హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రిత్ భూమ్రాను ముంబై అట్టిపెట్టుకోగా… ధోనిని చెన్నై, కోహ్లిని బెంగళూరు అధిక మొత్తం చెల్లించి తమ వద్దే ఉంచుకున్నాయి. శిఖర్ ధావన్ కూడా ఢిల్లీకి మారిన సంగతి తెలిసిందే.