కొత్త హెయిర్ స్టైల్ తో చంపేసిన కపిల్ దేవ్…

-

లాక్ డౌన్ లో ప్రజలను అలరించడానికి ప్రముఖులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా జనాలకు వినోదాన్ని పంచుతున్నారు. క్రికెటర్లు, సినీ ప్రముఖులు అందరూ కూడా తమ వంతుగా లాక్ డౌన్ బోర్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా ప్రపంచకప్ కెప్టెన్ కపిల్ దేవ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఆ ఫోటోలలో అతను కొత్తగా కనిపించడం విశేషం. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌ కొద్ది రోజుల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసాడు. ‘ట్రిమ్ ఎట్ హోం’ అనే ఛాలెంజ్‌ను చేసాడు కోహ్లీ… ఇంటిలోనే షేవింగ్ చేసుకొన్న వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసాడు. సచిన్ టెండూల్కర్ కూడా తనకు తానే హెయిర్‌కట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.

కపిల్ కూడా ఇప్పుడు అదే చేసాడు. పూర్తిగా గుండు చేసుకొని.. ఫ్రెంచ్ కట్ షేవింగ్‌తో కొత్త లుక్‌లో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. కపిల్ ఈ లుక్ లో అధిరిపోయారని, ఈ వయసులో కూడా అభిమానులను ఫిదా చేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక కళ్ళ జోడు పెట్టుకుని కపిల్ కనపడిన లుక్ బాగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news