IPl 2023 : KKR చేతిలో బెంగళూరు ఘోర ఓటమి

-

IPl 2023 : KKR చేతిలో బెంగళూరు ఘోర ఓటమి పాలైంది. కోల్కత్తా చేతిలో బెంగుళూరు 21 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. కోహ్లీ 54, మహిపాల్ లోమ్రోర్ 34, డూప్లిసెస్ 17, దినేష్ కార్తీక్ 22 రన్స్ మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో RCB 179/8కే పరిమితమైంది.

కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయేష్, రస్సెల్ చెరో రెండు వికెట్లు తీశారు.  మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీతో పోరాడినా… ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో..  పరాజయం పాలైంది బెంగళూరు జట్టు.

కాగా, IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news