Mohammad Shami : ష‌మీ అరుదైన రికార్డు..బ్యాటింగ్‌లో కోహ్లీని మించిపోయాడు

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు.

అయితే, ఈ మ్యాచ్ తో షమీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఒక కోహ్లీ నే కాదు ప్రస్తుతం ఉన్న హేమాహేమీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, పూజారులు సైతం షమీ ముందు చిన్నబోయారు.

ఇంతకు షమీ ఎలాంటి రికార్డు సాధించాడంటే, టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ కంటే కూడా ఎక్కువ సిక్స్ లు కట్టిన బ్యాటర్ గా నిలిచాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా, నిజం. టెస్టుల్లో కోహ్లీ కంటే షమీనే ఎక్కువ సిక్స్ లు కొట్టాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన కోహ్లీ, 8131 పరుగులు, 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేసినా, సిక్సులు మాత్రం 24 కొట్టాడు. 60 టెస్టులు ఆడి 685 రన్స్ మాత్రమే చేసిన షమీ, 25 సిక్సులు బాదాడు.

Read more RELATED
Recommended to you

Latest news