ఉప్పల్ స్టేడియంలో పర్యవేక్షక కమిటీ సమావేశం

-

ఉప్పల్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ పై పర్యవేక్షక కమిటీ విధివిధానాల పై భేటీ అయింది. ఈ పర్యవేక్షక కమిటీ లో సుప్రీం కోర్టు జస్టిస్ & కమిటీ చైర్మన్ కకృ, ఏసిబి డిజి అంజనీ కుమార్, మాజీ భారత క్రికెటర్ వెంకట పతి రాజు, కమిటీ సూపర్ వైజర్ నెంబర్ వంక ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు, మాజీలు పర్యవేక్షక కమిటీ కి పలు సూచనలు, రికార్డ్స్ తో పాటు డాక్యుమెంట్స్ సమర్పించారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్& కమిటీ చైర్మన్ కక్రు మాట్లాడుతూ.. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో పర్యవేక్షణ కమిటీ సమావేశం అయిందని తెలిపారు. గడిచిన కొద్దిరోజులుగా నలుగురు సభ్యులు గల పర్యవేక్షణ కమిటీ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పై దృష్టి కేంద్రీకరించిందన్నారు. అంతర్జాతీయ టీ – ట్వంటీ మ్యాచ్ విజయవంతం కావడం రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం అన్నారు. హైదరాబాద్ లో నిన్న ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ తమ‌ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిందన్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తమ నలుగురు సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీ పలు విషయాలపై రివ్యూ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని రికార్డులు , డాక్యుమెంట్లను కూడా వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ రివ్యూలో చాలా రిప్రజంటేషన్ లను స్వీకరించడం జరిగిందని … ఇందులో కొంతమంది ఓరల్ గా ఇచ్చారని తెలిపారు. అక్టోబర్ 3 వరకూ వచ్చిన రిప్రజంటేషన్ లపై విచారణ చేసి ఒక డేట్ నిర్ణయించి తమ నిర్ణయాలను తెలియజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news