ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

-

పౌరసరఫరాల శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్వో, డీఎంలతో ఈరోజు సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సీఎంఆర్, రాబోయే వానాకాలం పంట సేకరణ అంశాలపై ఉద్యోగులతో సుధీర్ఘంగా బేటీ అయ్యారు మంత్రి గంగుల కమలాకర్. ఎఫ్.సి.ఐ సీఎంఆర్ సేకరణ పునరుద్దరించిన తర్వాత జరుగుతున్న మిల్లింగ్ తీరుపై అసంత్రుప్తి వ్యక్తం చేసిన మంత్రి, ఖచ్చితమైన నిభందనలు పాటిస్తూ గడువులోగా మిల్లింగ్ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మిల్లింగ్లో జాప్యానికి అధికారులదే బాధ్యత అన్న మంత్రి అతి త్వరలోనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని సీఎంఆర్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేంక్షించేది లేదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్సీఐ వైఖరితో పాటు, మిల్లర్లకు సంబందించిన అంశాలపై సుధీర్ఘ కసరత్తు చేసారు.

జిల్లాల్లో మొన్నటి వానలకు తడిసిన ధాన్యం ఎంత ఉంది అనే వివరాలతో పాటు, ఈ వానాకాలం సేకరించాల్సిన ధాన్యం పరిమాణంపై వారంలోగా సమగ్ర నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. దానిపై మరోసారి సమావేశం నిర్వహిద్దామన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువవున్న నేపథ్యంలో వచ్చే వానాకాలం ధాన్యం నిలువ వుంచడానికి గల ఇంటర్మీడియట్ స్టోరేజీలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం క్రమం తప్పకుండా మిల్లులను తనిఖీ చేస్తూ మిల్లింగ్ ప్రక్రియతో పాటు అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news