T20 World Cup : బుమ్రా స్థానంలో టీమిండియాలోకి CSK బౌలర్ !

-

T20 World Cup : T20 ప్రపంచ కప్​కు ముందు టీమిండియాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ వైద్య బృందం అతడికి ఆడేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అయితే.. బుమ్రా స్థానంలో ఆసీస్‌ కు ఎవరిని పంపాలనే సందిగ్ధంలో బీసీసీఐ ఉంది.

ఈ నేపథ్యంలోనే ఓ వార్త వైరల్‌ గా మారింది. జాతీయ మీడియా నివేదిక ప్రకారం, ఈ బౌలర్ల జాబితాలో లేఫ్ట్ ఆర్ము ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి, చేతన్ సకారియా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ముఖేష్ చౌదరి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖేష్ ప్రస్తుతం పూణేలో శిక్షణ పొందుతుండగా, ఉమ్రాన్, సకారియా, కుల్దీప్ సేన్ ఇరానీ కప్ లో ఆడుతున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ లో భారత్ తమ తొలి మ్యాచ్ లో అక్టోబర్ 23న దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news