అప్పట్లో భారత జట్టు చేసిన దానికి ప్రతిగా పాక్ ఆటగాళ్లు ఈ నెల 16న భారత్‌తో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో సంబరాలు చేసుకోవాలని చూస్తున్నారట.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా ఈ నెల 16వ తేదీన ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఉన్న ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. అయితే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఓవైపు పాక్ ఆటగాళ్లు మాత్రం ఆ మ్యాచ్‌లో భారత ప్లేయర్ల వికెట్లు తీసి వెర్రి వేషాలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
గతంలో పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు 40 మంది భారత జవాలన్లను దారుణంగా బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడిని ఖండిస్తూ భారత క్రికెట్ ఆటగాళ్లు అప్పట్లో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జవాన్లకు నివాళులర్పించారు. ఆ మ్యాచ్‌లో ధోనీ సహా టీం ఇండియా ప్లేయర్లంతా భారత ఆర్మీ క్యాపులను ధరించి మ్యాచ్ ఆడారు.
అయితే అప్పట్లో భారత జట్టు చేసిన దానికి ప్రతిగా పాక్ ఆటగాళ్లు ఈ నెల 16న భారత్‌తో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో సంబరాలు చేసుకోవాలని చూస్తున్నారట. భారత ప్లేయర్ల వికెట్లను తీయగానే సెలబ్రేట్ చేసుకుందామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అన్నాడట. అయితే ఈ విషయం తెలిసిన పాక్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను అలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించినట్లు తెలిసింది. కాగా గతంలో 2016లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ సెంచరీ చేసి అనంతరం మైదానంలోనే పుషప్స్ చేశాడు. తమ ఆర్మీకి నివాళులు అర్పించినట్లు మిస్బా తరువాత చెప్పాడు.
అయితే ఆ తరహాలోనే ఇప్పుడు భారత్ తో జరగనున్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు భారత ప్లేయర్ల వికెట్లు తీసి సంబరాలు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి పాక్ ఆటగాళ్లు అన్నంత పని చేస్తారా.. లేక బోర్డు ఆదేశాలకు కట్టుబడి మౌనంగా ఉంటారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం.. స్పందించేందుకు భారత ప్లేయర్లు రెడీగానే ఉంటారు. అది గుర్తు పెట్టుకుని పాక్ ప్లేయర్లు మసలుకుంటే మంచిది. లేదంటే భారత్ చేతిలో పాక్ ఇంకా ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..!