ఇండియా కెప్టెన్ పై పాకిస్తాన్ ప్రసంశలు…!

-

ఇండియా, వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా తన ఆట తీరుతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తుంది. ఈ మ్యాచ్ లో ప్రధానంగా రహానే ఆట తీరు, అతని సారధ్యం క్రీడా పండితులను కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుని అతను ఎదుర్కొన్న విధానంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అజింక్య రహానె కెప్టెన్సీని ప్రశంసించారు.

ఇండియా స్టాండ్-ఇన్ కెప్టెన్ రహానేకి క్రికెట్ పై అవగాహన ఎక్కువగా ఉందని అతను అన్నాడు. అజింక్య రహానె వంటి కెప్టెన్ నాయకత్వంలోని జట్టు పాత్ర చాలా బాగుందని అన్నారు. అతను తెలివైన క్రికెటర్ అని అక్తర్ అన్నాడు. చాలా క్రికెట్ అవగాహన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నాడు. చాలా మంచి కెప్టెన్సీ చేసాడు అని అక్తర్ అభినందించారు. అతని బౌలింగ్ మార్పులను, బౌలర్లు స్పందించిన విధానాన్ని మీరు చూడవచ్చు.

రహానే ఒత్తిడిలో ప్రశాంతంగా ఉన్నాడు మరియు ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి నిర్ణయాలు తీసుకుని పరిణితి ప్రదర్శించాడని అన్నాడు. కెప్టెన్ పాత్ర మీదనే జట్టు ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా రెండో టెస్ట్ లో రహానే సెంచరీ చేసాడు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా టీం ఇండియా విజయం సాధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news