క్రికెట్ నుంచి తప్పుకున్న గంగూలీ మెచ్చిన “బాలుడు”…!

టీం వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. బుధవారం ఒక సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్రకటించాడు. 18 ఏళ్ళ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి అతను గుడ్ బై చెప్పాడు దేశవాళి క్రికెట్ ఆడకుండానే అతను టీం ఇండియాకు కీపర్ గా వచ్చాడు. 17 ఏళ్ళ వయసులో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2002 లో నాటింగ్‌హామ్‌ లో ఇంగ్లండ్‌పై అతను తన మొదటి టెస్ట్ ఆడాడు.

తద్వారా అతి పిన్న వయస్కుడైన టెస్ట్ వికెట్ కీపర్ అయ్యాడు. 18 సంవత్సరాల కెరీర్లో 25 టెస్ట్ లు 38 వన్డేలు మరియు 2 టి 20 లు ఆడాడు. గంగూలీ ఎంతో మెచ్చి అతన్ని చిన్న వయసులోనే టీంలోకి తీసుకొచ్చాడు. పార్థివ్ పటేల్ చివరిసారిగా 2018 లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీం ఇండియాకు ఆడాడు. 35 ఏళ్ళ పార్థివ్ పటేల్ కి హిట్టర్ గా కూడా పేరుంది.