IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు

-

IPL 2023లో భాగంగా… నిన్న చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 6వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది. 20 ఓవరల్లో చెన్నై సూపర్ కింగ్స్… 217 పరుగులు చేయగా.. ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులు మాత్రమే చేసింది.

దీంతో ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్‌ లో రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సులు, 3 ఫోర్లతో.. 57 పరుగులు చేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. అయితే.. ఈ ఇన్నింగ్స్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాదీన ఓ సిక్సు… స్టేడియంలో ఉన్న ఓ కారు తగిలి.. ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అయితే… రుతురాజ్‌ గైక్వాడ్‌ కారును బద్దలు కొట్టడంతో.. రివార్డు కింద రూ.5 లక్షలు గెలుచుకున్నాడు. ఈ మేరకు ఆ కారు సంస్థ ప్రకటన చేసింది. ఇలా రివార్డు ఇవ్వడం ఐపీఎల్‌ లో రూల్‌ అన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news