ముంబైలో మోత మోగించిన టీమిండియా.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే..?

-

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్‌ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (92 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (94 బంతుల్లో 88, 11 ఫోర్లు) శతకాలు మిస్‌ చేసుకోగా శ్రేయస్‌ అయ్యర్‌ (56 బంతుల్లో 82, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించి భారత్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

లంక బౌలర్లలో దిల్షాన్‌ మధుశంక.. ఐదు వికెట్లు పడగొట్టాడు. వాంఖేడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తాకింది. ఫస్ట్‌ బాల్‌కే బౌండరీ బాదిన కెప్టెన్ హిట్‌మ్యాన్‌.. మధుశంక వేసిన రెండో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీ-గిల్‌లు నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన కెఎల్‌ రాహుల్‌ (19 బంతుల్లో 21, 2 ఫోర్లు) – శ్రేయాస్‌ అయ్యర్‌లు నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఉన్నంతసేపూ ఆత్మవిశ్వాసంతో ఆడిన రాహుల్‌.. చమీర వేసిన 40వ ఓవర్లో హేమంతకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు.అయ్యర్‌ దూకుడుతో పాటు ఆఖర్లో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35,1 ఫోర్, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో భారత్‌ 357 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక లక్ష్యం 358 పరుగులు చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news