IND vs BAN : బ్యాటింగ్ విఫలం.. 186 పరుగులకే టీమిండియా ఆలౌట్‌..

-

Bangladesh vs India, 1st ODI : భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి వన్డే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసింది. అయితే, బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో భారత బ్యాటర్లు తడబడ్డారు.


టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 200 పరుగులు కూడా చేయలేక పోయింది. 41.2 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. వైస్ కెప్టెన్ కే ఎల్ రాహుల్(73) ఒక్కడే హాఫ్ సెంచరీ తో రాణించాడు. బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక 187 పరుగుల టార్గెట్‌ బంగ్లాదేశ్‌ మరికాసేపట్లో ఛేజింగ్‌ కు దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news