2008లో కివీస్‌పై నెగ్గిన భారత అండర్-19 టీం.. హిస్టరీ రిపీట్ అవుతుందా..?

-

2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడగా ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కప్ వేరే.

శ్రీలంకపై భారత్ విజయం సాధించడం… అటు ఆసీస్‌పై సౌతాఫ్రికా గెలుపొందడంతో ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ లీగ్ దశలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో భారత్ 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లో జరగనున్న మొదటి సెమీఫైనల్‌లో తలపడనుంది. అయితే 2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ భారత్, కివీస్‌లు తలపడగా ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడగా ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కప్ వేరే. ఇక రెండు జట్లకు అప్పట్లో కోహ్లి, కేన్ విలియమ్సన్‌లు కెప్టెన్‌లుగా ఉండగా, ఇప్పుడు కూడా అవే జట్లకు వారిద్దరే కెప్టెన్లుగా ఉండడం మరో విశేషం. ఇక అప్పట్లో భారత అండర్-19 జట్టు తరఫున ఆడిన రవీంద్ర జడేజా ఇప్పుడు భారత జట్టులో ఉండగా, కివీస్ తరఫున అప్పుడు ఆడిన ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీలు ఇప్పటి కివీస్ టీంలోనూ ఉన్నారు. అప్పట్లో కోహ్లి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేయగా, టిమ్ సౌతీ కోహ్లి వికెట్ తీశాడు.

అయితే అప్పట్లో అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో లాగే ఇప్పుడు కూడా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడుతుండడంతో హిస్టరీ రిపీట్ అవుతుందని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి మ్యాచ్‌లో కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అందులో టీమిండియా న్యూజిలాండ్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో అదేలాంటి ఫలితం రిపీట్ కావాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version