ఇండియాకు ధోనీ, ద్రావిడ్ దొరికేసారు…!

-

టీం ఇండియాను ఎన్నాళ్ళుగానో వేధిస్తున్న సమస్యలు రెండు. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరూ…? నాలుగో స్థానంలో ఆడేది ఎవరూ…? ద్రావిడ్ తప్పుకున్న తర్వాత నాలుగో స్థానంలో సరైన ఆటగాడు టీం ఇండియాకు దొరకలేదు. ధోని తప్పుకుంటే ఎవరూ అనేది స్పష్టత లేదు. దానికి ఒక ఇద్దరు యువ ఆటగాళ్ళు తక్కువ సమయంలో సమాధానం చెప్పేశారు.

వాళ్ళే శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్. నాలుగో స్థానం కోసం ద్రావిడ్, యువరాజ్ తర్వాత చాలా ప్రయత్నాలు చేసింది టీం ఇండియా. అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, ఇలా దాదాపు పది మంది పేర్లను టీం ఇండియా యాజమాన్యం పరిశీలించింది. అయినా సరే ఆ స్థానానికి సరైన ఆటగాడు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. అయితే శ్రేయాస్ అయ్యర్ మాత్రం తాను ఏంటో నిరూపించాడు.

మొదటి వన్డేలో నాలుగో స్థానంలో అతని ఆట చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. టి20 సీరీస్ లో అతను అప్పటికే ఆ స్థానంలో ప్రూవ్ చేసుకున్నాడు. వన్డేల్లో కూడా చేసుకున్నాడు. కాని నాలుగో వన్డేలో ఇక ఆ స్థానం తనదే అని చెప్పేసాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అవగానే కోహ్లితో జత కలిసి తొలుత కాస్త ఇబ్బంది పడినా వికెట్ పడకుండా కాపాడుకుని రెచ్చిపోయాడు. చక్కగా సెంచరి బాదేసాడు.

చాలా స్వేచ్చగా బ్యాటింగ్ చేసాడు అయ్యర్. ఇక రాహుల్ విషయానికి వస్తే… కోహ్లి అవుట్ అవగానే క్రీజ్ లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే విరుచుకుపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో ఆ స్థానంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అదే స్థాయిలో తొలి వన్డేలో చెలరేగిపోయాడు రాహుల్. సిక్సులతో స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు. అయ్యర్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

చూస్తుండగానే 86 పరుగులు చేసేసాడు. ఇక కీపింగ్ లో కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు రాహుల్. దీనితో ధోని స్థానాన్ని దాదాపుగా భర్తీ చేసాడు. అవసరమైతే కెప్టెన్ గా కూడా తన సేవలు అందిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఈ ఇద్దరు యువ ఆటగాళ్ళు మరికొన్నాళ్ళు ఇదే విధంగా ఆడితే ఇక ధోని ద్రావిడ్ లోటు టీం ఇండియాలో కనపడదు అంటున్నారు. మిడిల్ ఆర్డర్ ని వాళ్ళు మోస్తారు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news