భార‌త్‌కు ఆదిలో షాక్‌.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..

-

దక్షిణాఫ్రికాతో గురువారం పుణె వేదికగా ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌‌‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు భార‌త జ‌ట్టు. అయితే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

గత ఆదివారం విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ఈరోజు పుణెలో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటైపోయాడు. ఈ దశలో మయాంక్, పుజారాలు జట్టుకు అండగా నిలిచాడు. దీంతో తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్‌లో మయాంక్(34), పుజారా(19) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news