మ‌రో వివాదంలో బిగ్‌బాస్‌.. షోను నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ‌

-

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్‌ బాస్‌ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షో ప్రేక్ష‌కుల‌ను బాగానే మెప్పిస్తోంది. అయితే హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ను వెంటనే నిలిపేయాలంటూ కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ‘లోని’ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ లేఖ రాశారు.

సమాజంలో అసభ్యతను వ్యాప్తి చేస్తూ, నైతిక విలువలను దెబ్బతీస్తున్న ఈ షోపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. బిగ్‌బాస్ హిందీ షో ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే. దక్షిణాది భాషల్లోనూ ఈ షో మొదలైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news