దుమ్ము రేపిన టీం ఇండియా, కపిల్ సరసన నిలిచిన యువ బౌలర్…!

-

భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టి20 లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు. ఎక్కడా కూడా శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియాకు బౌలర్లు శుభారంభం ఇచ్చారు. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ని నవదీప్ సైని బౌల్డ్ చేసాడు. ఇక అక్కడి నుంచి శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోయింది. 20 పరుగుల తేడాతో ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు.

ఒక పక్క పరుగులు ఇవ్వకుండానే, క్రమంగా వికెట్లు తీయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా సైని, కులదీప్ యాదవ్ చెరో రెండు, సుందర్, బూమ్రా తలో వికెట్ తీసారు. శ్రీలంక బ్యాట్స్మెన్ లో కుశాల్ పెరారా ఒక్కడే 34 పరుగులు చేయగా, చివర్లో ధనుంజయ డిసిల్వా 17 పరుగులు చేసాడు.

మొదటి మ్యాచ్ రద్దు అయినా సరే టీం ఇండియా ఈ మ్యాచ్ లో సత్తా చాటింది. ఇక ఇదిలా ఉంటే భారత ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ దశాబ్దంలో ఫస్ట్ వికెట్ తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. గత మూడు దశాబ్ధాలను చూసినట్లయితే 90వ దశకంలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్.. భారత్‌కు తొలి వికెట్ అందించగా 2000 లో జవగళ్ శ్రీనాథ్, 2010 శ్రీశాంత్ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news