మూడో టెస్టు: మూడో రోజు తొలి ఓవర్‌లోనే కెప్టెన్ ఔట్..

-

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజుకు చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మూడో రోజు ఆట ఆరంభంలోనే సఫారీలకు భారీ షాక్ తగిలింది. ఈ రోజు ఆట ఆరంభంలోనే సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(212), అజింక్యా రహానే(115) రాణించడంతో భారత్ 116.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 497 పరుగులు చేసింది.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో హంజా(7), బవుమా(0) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news