ఫైనల్ లో AUS అందుకే బ్యాటింగ్ తీసుకోలేదు: అశ్విన్

-

నవంబర్ 19న అహమ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ను ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత మాములుగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అలవాటు ఆస్ట్రేలియాకు ఉంది.. ఈ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో ఇదే విధంగా చేసింది. కానీ ఒక్క ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టాస్ నెగ్గగానే బ్యాటింగ్ కు బదులుగా ఫీల్డింగ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కారణాన్ని చెప్పాడు. అశ్విన్ మాట్లాడుతూ… ఆ మ్యాచ్ అనంతరం నేను బెయిలీ తో మాట్లాడానని… బెయిలీ ఇంతకు ముందు ఈ గ్రౌండ్ లో చాలా మ్యాచ్ లు చూశామని.. ముందుగా ఈ గ్రౌండ్ బౌలింగ్ కు ఆ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడంటూ అశ్విన్ బయటపెట్టాడు.

అయినప్పటికీ బ్యాటింగ్ బౌలింగ్ లో ఏమీ ఉండదు మనము పూర్తి ప్రదర్శన చేస్తేనే మ్యాచ్ లో గెలుపుకు అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news