IPL 2024: పడిలేచిన సింహంలా..ఆర్సీబీ సంచలన రికార్డు సృష్టించింది. గుజరాత్ తో మ్యాచ్ లో ఆర్సిబి సంచలనం సృష్టించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న 21 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 16 ఓవర్లలోనే చేదించిన సంగతి తెలిసిందే.

అంతకుముందు 2023లో ఆర్సిబిపై ముంబై 21 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్ (100*), కోహ్లీ (70*) చెలరేగారు.