మూడు ప్రపంచ కప్ ల విజేత… క్రికెట్ కి గుడ్ బై

-

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు ప్రముఖ‌ స్పిన్నర్‌ లారా మార్ష్‌ అన్నిరకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నట్లు చెప్పింది. అంతకముందే గతేడాది డిసెంబరులో అంతర్జాతీయ కెరీర్​కు స్వస్తి పలికింది.

తనకు ఇంతకాలం అండగా నిలిచి ప్రోత్సాహించిన వారికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది లారా. ఈ సుదీర్ఘ ప్రయాణంలోని ఎన్నో మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పింది.ఇంగ్లాండ్‌ సాధించిన ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్లో పాలుపంచుకుంది లారా. 2006 లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసింది. 2009, 2017 మహిళల వన్డే ప్రపంచ‌కప్‌ గెలిచిన జట్టులో కీలకపాత్ర పోషించింది. 2009లో జరిగిన టీ20 ప్రపంచకప్​లోనూ విజయం సాధించిన జట్టులోనూ ఉంది. కెరీర్​లో 103 వన్డేలు, 67 టీ20లతో పాటు 9 టెస్టులు ఆడిన మార్ష్‌.. 217 వికెట్లు తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news