ఇటీవల ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా తాజా ఐసిసి వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భారీగా పరుగులు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా 45 రేటింగ్ పాయింట్లు పడి 2 వ స్థానానికి పడిపోయింది. చేతి గాయంతో భారత్తో వన్డే సిరీస్ ఆడకపోయినా అగ్రస్థానానికి కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేరుకున్నాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచుల్లో కూడా కొత్త బంతితో భారత జట్టు వికెట్లు తీయడానికి చాలా కష్టపడింది. దీనికి ప్రధాన కారణం ప్రధాన పేసర్ గా ఉన్న బూమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడమే. మంగళవారం జరిగిన 3 వ వన్డేలో బుమ్రా 10 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు గాని వికెట్ మాత్రం తీయలేదు. మొదటి రెండు మ్యాచ్ల్లో అతను వరుసగా 64, 53 పరుగులు ఇచ్చాడు గాని వికెట్ తీయలేదు.
ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే పాయింట్లు పడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. 869 పాయింట్లతో వన్డేల్లో నెంబర్ 1 బ్యాట్స్మన్ గా ఉన్నాడు. గాయంతో వన్డే సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ 855 పాయింట్లతో 2 వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం 829 పాయింట్లతో 3 వ స్థానంలో ఉండగా, రాస్ టేలర్ 828 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.