IPL SRH vs KKR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స‌న్ రైజ‌ర్స్

-

ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు 25వ మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు మ‌ధ్య జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ను స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. కాగ శ్రేయ‌స్ అయ్యాన్ నేతృత్వంలోని కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. అయితే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల్లో విజ‌యం సాధించి ఫుల్ జోష్ లో ఉంది.

హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని చూస్తుంది. అయితే సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఆల్ రౌండ‌ర్ సుంద‌ర్ ఈ మ్యాచ్ కు దూరం కావ‌డం మైన‌స్ అనే చెప్పాలి. సుంద‌ర్ స్థానంలో జ‌గ‌దీశ్ సుచిత్ ను తుది జ‌ట్టులోకి తీసుకున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు :
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), ఐడెన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, జగదీశ్ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు :
ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీప‌ర్), పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news