ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని వైసీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంతేకాకుండా ఆయన భార్యకు కూడా కరోనా సోకిందని సమాచారం. దీంతో వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటుగా ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కేసుల శ్రీకాళహస్తిలో పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా లాక్‌డౌన్ సమయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా దాతల ఫొటోలతో ర్యాలీ తీయడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని ఆయనపై విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ కూడా కరోనా బారిన పడ్డాడు.